అన్నమయ్య: ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతును రాజుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయచోటి మండల టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. సోమవారం మందరం గ్రామపంచాయతీలో నిర్వహించిన “రైతన్న.. మీకోసం” కార్యక్రమంలో ఆయన పాల్గొని, రైతులు ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.