ADB: ఎయిడ్స్ వ్యాధి నిర్ములనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ అన్నారు. సోమవారం ఎయిడ్స్ డే సందర్భంగా జువాలజీ విభాగం, NSS ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ నర్సింగ్ రావు, రాజ్‌కుమార్, డాక్టర్ రవీందర్, డాక్టర్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.