ADB: అందరూ కలిసికట్టుగా పనిచేసి జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని నూతన డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా నరేశ్ జాదవ్‌ను మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ అధ్యక్షులు మోతిరామ్, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.