GNTR: పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకట ప్రసాద్ బృందం నిర్వహించిన దాడిలో 1,160 గ్రాముల గంజాయి, ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు మహంకాళి శివ మణికంఠ (21), భేటి బద్రినారాయణ (20)గా గుర్తించారు. గంజాయి అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచామన్నారు.