అనకాపల్లి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 3.13 గంటల వరకు 91.62 శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసినట్లు డీ.ఆర్.డీ.ఏ పీడీ శచీదేవి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,56,338 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,34,866 మందికి అందజేసినట్లు తెలిపారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.63 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.