KDP: గీతా జయంతి సందర్భంగా కడప పట్టణంలోని మున్సిపల్ గ్రౌండ్ ఆవరణంలో శ్రీ దత్త సాయి మందిరం నందు సోమవారం శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాల పారాయన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత వక్త సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు భగవద్గీతపై వకృత్వ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రధానం చేశారు.