WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచుల హయాంలో చేసిన అభివృద్ధి పనులకు రూ. 79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శుల ఖర్చులకు రూ. 20 కోట్లు బకాయిపడ్డాయి. మొత్తం రూ. 99.68 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వ అంచనా. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.