కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం దగ్గర సద్గురు చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన లింగ భైరవి దేవి.. స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర, కారుణ్య స్వరూపం. జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు ఈ ఆలయం నెలవు. ఈ 8 అడుగుల శక్తి స్వరూపం.. విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సన్నిధిలోనే సమంత, రాజ్ నిడిమోరు ఒక్కటైన విషయం తెలిసిందే.