PLD: సత్తెనపల్లిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ద్వారా లక్షలాది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తోంది అన్నారు.