SRPT: మునగాల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు రవి నాయక్ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేసిన అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. నామినేషన్ తదితర అంశాలు ఎప్పటికప్పుడు మండల కేంద్రానికి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.