HYD: దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ సిబ్బందిని ఓ ప్రయాణికుడు లైంగికంగా వేధించాడని బాధితురాలు ఆరోపించింది. విమానం హైదరాబాద్ చేరుకోగానే RGIA పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని లైంగిక వేధింపులు, దాడికి సంబంధించిన BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తి కేరళ వాసిగా గుర్తించారు.