AP: ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఆర్డర్స్ తీసుకున్న ప్రకాష్.. ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో ఆయన విధుల్లోకి చేరనున్నారు. కాగా, వైసీపీ ప్రభుత్వంలో కానిస్టేబుల్ ప్రకాష్‌ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.