AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. ఏలూరు జిల్లా నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గ్రామసభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదని, ఒక మార్పు రావాలని తెలిపారు. అభివృద్ధి పనుల వివరాలన్నీ సచివాలయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.