E.G: ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇవాళ రాజమండ్రిలోని వై-జంక్షన్ వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్, డిఎల్ఎస్ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో HIV టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు.