కోనసీమ: అయినవిల్లి మండల సచివాలయ అధికారిగా ఎస్.రాజా మోహన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతవరకు అల్లవరం గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. పదోన్నతి లభించడంతో అయినవిల్లి మండల సచివాలయాల అధికారిగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీడీవో సరోవర్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.