HYD: నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన 5 కేసుల్లో నాంపల్లి కోర్టు పీటీ వారెంట్ అనుమతించింది. ఐదు కేసుల్లోనూ పీటీ వారెంట్ అనుమతినివ్వడంతో కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రవికి 12 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్పై సుదీర్ఘంగా ఇరు వర్గాల వాదన కొనసాగింది. కాగా, డిసెంబర్ 3న మరోసారి నాంపల్లి కోర్టు విచారించనుంది.