VZM: రాజాం మండలం కొఠారి పురం గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం ద్వారా లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ నగదు పంపిణీ చేశారు. ఉదయం నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకే 91% మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందజేసినట్లు తెలిపారు.