AP: రాష్ట్రంలో కొత్త పురుగు వ్యాధి కలకలం రేపుతోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడంతో ఓ మహిళ అనారోగ్యానికి గురై మృతిచెందింది. మృతురాలు విజయనగరం జిల్లా మెట్టపల్లికి చెందిన రాజేశ్వరి(36)గా గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1317 స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. సాధారణ యాంటి బయాటిక్స్‌తో ఈ వ్యాధి నయం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.