ATP: గుత్తి మండలం బేతపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కాయల వెంకటరాముడు సోమవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గుత్తి మార్కెట్ యార్డు చైర్మన్ జక్కలచెరువు ప్రతాప్, టీడీపీ నాయకులు వెంకటరాముడు భౌతికకాయానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.