RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశాడు. కాంగ్రెస్ సీనియర్ నేత బాల్ రెడ్డి సారథ్యంలో ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండదండలతో నందిగామ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.