కాంగ్రెస్ నేత శశి థరూర్ తీరుపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు సోనియా గాంధీ నిర్వహించిన కీలక భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. తల్లి అనారోగ్యం అని కారణం చెప్పినా.. ఆయన మోదీని పొగడటం, పార్టీ మీటింగ్స్ ఎగ్గొట్టడంపై పార్టీ సీరియస్గా ఉంది. గతంలో పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ ఈవెంట్కు వెళ్లారు. దీంతో పార్టీ మారతారని ప్రచారం జోరందుకుంది.