పార్లమెంట్లో ఇవాళ ‘SIR’ అంశంపై రచ్చ జరిగేలా ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే SIRపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. దీనిపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు. జీరో అవర్ రద్దు చేసి, మిగతా పనులన్నీ పక్కనపెట్టి దీనిపైనే ప్రత్యేకంగా చర్చించాలని డిమాండ్ చేయబోతున్నారు.