GNTR: తెనాలి మండలం కంచర్లపాలెంలో ‘అన్నదాత సుఖీభవ’ ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. ఆదివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో MLC ఆలపాటి, నాయకులు ప్రతి గడపకూ వెళ్లారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా అన్నదాతలకు ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు.