అన్నమయ్య: దిత్వా తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా సోమవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన గ్రీవెన్ సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసాలతో కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.