SKLM: దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.