గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని స్టెప్ డౌన్ ఐసీయూ వద్ద 55 ఏళ్ల ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం మార్చూరీలో భద్రపర్చినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. క్యాజువాల్టీలో వైద్యులు పరీక్షించగా, ఆ వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు వైైద్యులు నిర్ధారించారు. మృతుని వివరాలు తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.