దేశంలో స్వదేశీ పవనం వీస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘జనం స్వదేశీ ఉత్పత్తుల వైపే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువత వోకల్ ఫర్ లోకల్‌ను లైఫ్ స్టైల్‌గా మార్చుకోవడం సంతోషకరం. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ షాపింగ్‌లోనూ ఇదే జోష్ చూపించాలి. విదేశీ బ్రాండ్ల మోజులో పడకుండా.. మన దేశంలో మన వాళ్లు కష్టపడి తయారుచేసిన వస్తువులనే కొనాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.