ATP: వజ్రకరూరు మండలం రాగులపాడు పంప్ హౌస్ వద్ద శనివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి శవం నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చింది. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.