‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు ఉత్తేజపరుస్తాయి.. కొన్ని ఆలోచించేలా చేస్తాయి.. కానీ, ఇది మన సనాతన ధర్మాన్ని చూపించే సినిమా అని తెలిపారు. తప్పును నిలదీయడమే సనాతన ధర్మం అని, సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే వాళ్లు సైనికులు అయితే.. ధర్మాన్ని కాపాడే సైనికులు అఘోరాలు అని పేర్కొన్నారు.