W.G: ప్రజా సమస్యలను వారి వద్దకే వెళ్లి పరిష్కరిస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం పెంటపాడు మండలం అలంపురంలో ‘గ్రీవెన్స్’ నిర్వహించారు. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధికి అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.