ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో కందిపంట సాగు చేస్తున్న రైతులకు పొలంబడి కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి జోష్ణాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం కంది పంట మొగ్గ దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మొగ్గ దశలో పురుగు ఆశించకుండా నివారించడానికి వేపనూనె పిచికారి చేయాలన్నారు.