CTR: పుంగనూరు మండల డిప్యూటీ ఎంపీడీవోగా సుధాకర్ రావును నియమిస్తూ జడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. గంగవరం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న సుధాకర్‌రావు పదోన్నతిపై పుంగనూరుకు బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అందరి సహకారంతో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.