MDK: చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ జడ్పీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని P.అక్షిత రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైందని హెచ్ఎం ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల 2 వరకు రాజన్న సిరిసిల్లలో జరిగే ఎనిమిదవ తెలంగాణ అండర్ 18 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థిని అక్షితను అభినందించరు.