NZB: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో విద్యను కార్పొరేట్‌గా మార్చాయని ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య అన్నారు. నిజామాబాద్ జిల్లా మహాసభలు శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుంచి CVR జూనియర్ కళాశాల వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.