ASR: చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో సాగు చేస్తున్న చిలకడదుంప పంటకు ఈ ఏడాది మంచి గిరాకీ నెలకొంది. రెండు మండలాల్లో మొత్తం 200 ఎకరాల్లో ఈ పంటను రైతులు సాగుచేశారు. ఎకరానికి సుమారు రూ.25,000 పెట్టుబడి పెడితే, ఖర్చులు పోను అదనంగా మరో రూ.25,000 వరకు ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో గిరి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.