భారత్-నేపాల్ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలతో కూడిన మ్యాప్‌తో నేపాల్ రూ.100 నోట్లను విడుదల చేసింది. అయితే, ఈ నోట్లపై గతంలోనే తమ దేశ మ్యాచ్ ఉందని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ అధికార ప్రతినిధి వివరించారు. ఆ మూడు ప్రాంతాలు తమవని భారత్ పేర్కొంది. వాటిని తమ ప్రాంతాలుగా చూపుతూ సవరించిన మ్యాప్‌ను నేపాల్ 2020లో విడుదల చేసింది.