WPL వేలంలో 6 టైమ్ T20I వరల్డ్ ఛాంపియన్, ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీని ఎవరూ తీసుకోకపోవడం అభిమానులను విస్మయపరిచింది. ఈ క్రమంలో నలుగురు విదేశీ ప్లేయర్లకే ఛాన్స్ ఉండటంతో జట్టు కూర్పులో భాగంగా ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యమిచ్చామని UPవారియర్స్, DC పేర్కొన్నాయి. బలమైన టాపార్డర్, ఆఫ్ స్పిన్నర్‌గా జార్జియా వోల్, కీపర్‌గా రీచా ఉండటంతో హేలీని తీసుకోలేకపోయామని RCB తెలిపింది.