HYD: మన HYD మెట్రోకు నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. 8 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు దాటిన మెట్రో నేడు రోజూ 57 మెట్రోరైళ్లు 1,100 ట్రిప్పులు తిరుగుతూ లక్షల మంది నగర ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69KM పరిధిలో మెట్రో పరుగులు పెడుతోంది.