NZB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రజలు టీ-పోల్ మొబైల్ యాప్ను వినియోగించుకోవాలని NZB జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కోరారు. పోలింగ్ స్టేషన్, ఓటర్ స్లిప్ డౌన్లోడ్, ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు యాప్ ఉప యోగపడుతుందని అన్నారు. యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.