SRCL: ఎల్లారెడ్డిపేట(M) గండిలచ్చపేటకు చెందిన బల్లెపు నర్సయ్య అనే మాజీ నక్సలైట్ దారుణహత్యకు గురయ్యాడు. ఇటీవల నర్సయ్య తాను అజ్ఞాతంలో ఉండగా ఎందరినో చంపినట్లుగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పేర్లతో సహా వివరించాడు. ఈ క్రమంలో తన తండ్రిని నర్సయ్య చంపినట్లుగా నిర్ధారణకు వచ్చిన JGLకు చెందిన సంతోష్ అనే వ్యక్తి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లి హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపి లొంగిపోయాడు.