ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్లలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొంగటి శ్రీను(45) కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటి కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికి అతను మృతిచెందాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.