గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డిసెంబర్ 3న జరగనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. పొన్నూరు రోడ్డులో స్కిల్ కమ్యూనికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 900 ఉద్యోగాలకు ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.