WNP: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో యజమానులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వారికి అవగాహన కల్పించారు.