KMR: జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను ఈ నెలాఖరుకే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో ఐకేపీ, సివిల్ సప్లై, ఫాక్స్, ఇతర శాఖల అధికారులతో వరి కొనుగోలు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేంద్రంలో తగిన సంచులు, వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.