MNCL: దండేపల్లి మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహాన్విత(7) మృతదేహం లభ్యమైనది. రెండు రోజుల క్రితం మహాన్విత అదృశ్యం కాగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం ఇంటి సమీపంలోని బావిలో మహాన్విత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె మృతిపై పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. మహాన్విత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.