కృష్ణా: విజయవాడ రాణిగారితోటలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అబ్బాయి, అదే స్కూల్లో 8వ తరగతి అమ్మాయి ప్రేమించుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాలుడి పుట్టినరోజు కావడంతో బయటకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఇరువురు తల్లిదండ్రులు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వీరి కోసం గాలిస్తున్నట్లు కృష్ణలంక సీఐ నాగరాజు పేర్కొన్నారు.