తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) పై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహ వ్యక్తం చేశారు. కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులది సూడో మనస్తత్వం గలవారన్నారు. పార్లమెంట్ (Parliament) భవన ప్రారభోత్సవంతో దేశప్రజలు గర్విస్తుండగా ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. బీసీలను చిన్న చూపు చూసే పార్టీలుగా అభివర్ణించారు.ప్రధానిమోదీని వ్యతిరేకించడం లేదని, ప్రధాని పేరుతో బీసీ తెగలను అవమాన పరుస్తున్నాయరని మండిపడ్డారు. మమతా బెనర్జీ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే వ్యతిరేకిస్తారా…? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న పార్టీలు బీసీ వ్యతిరేకులన్నారు.
కేసీఆర్ హైదరాబాద్(Hyderabad)లో నిర్మించిన అసెంబ్లీ ప్రారంభోత్సవం గవర్నర్తో చేయించారా…? అంటూ నిలదీశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సోనియాగాంధీని కాంగ్రెస్ నాయకులు తీసుకుని వెళ్ళ లేదా…..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సహా అన్ని పార్టీలు సమాధానం చెప్పాలన్నారు ఎస్టీ మహిళను రాష్ట్రపతి(President)గా ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా అడ్డుపడ్డారని అన్నారు. ఆమెపై చాలా వ్యాఖ్యలు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు బీసీ తెగలపై అక్కసు వెళ్లగక్కే రీతిలో వారి వ్యాఖ్యలున్నాయన్నారు. కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులని…చైనా, రష్యాలకు గొడుగులు పడుతున్నారనీ ఆరోపించారు.ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రధాని మన్ కీ బాత్(Mann Ki Bath)లో ప్రస్తావించారని చెప్పారు. అది తెలుగు ప్రజలందరికీ అందరికీ గర్వకారణం అన్నారు నరేంద్రమోదీ మహోన్నత వ్యక్తిత్వం కలవారని కొనియాడారు.