ADB: జిల్లాలో పల్లె పోరుకు నగారా మోగింది. నేటి నుంచి మొదటి విడతకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ADB జిల్లాలో 473 జీపీలు, 3, 870 వార్డులు ఉన్నాయి. నిర్మల్- 400 జీపీలు, 3,368 వార్డులు, మంచిర్యాల-306 జీపీలు, 2,860 వార్డులు, కొమురం భీమ్- 335 జీపీలు, 2, 874 వార్డులు ఉన్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 506 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి.