CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన దాత రాజేంద్రప్రసాద్ రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి ఆయనకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.