Salman Khan: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman khan) ప్రస్తుతం అబుదాబిలో ఉన్నారు. ఇక్కడ అతను IIFA అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యాడు. దాంతో పాటు తన రాబోయే చిత్రం ‘టైగర్ 3′(tiger3) షూటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. ‘టైగర్ 3’ షూటింగ్(shooting)ని త్వరలో పూర్తి చేయనున్నట్లు సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించాడు. ఈ దీపావళికి సందడి చేసేందుకు సల్మాన్ సిద్ధమవుతున్నాడు. కాగా, సల్మాన్ ఖాన్ కొత్త వీడియోను షేర్(share) చేశారు. భాయిజాన్ ఈ వీడియోలో తన సోదరి అర్పిత పిల్లలిద్దరితో కలిసి కనిపిస్తున్నాడు.
ఫిట్నెస్ విషయంలో సల్మాన్ ఖాన్ ఎంత సీరియస్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా కార్డియో, వర్కవుట్లు ప్రారంభిస్తాడు. అటువంటి పరిస్థితిలో, IIFA రాత్రి తర్వాత సల్మాన్ హోటల్‌కు చేరుకున్నప్పుడు అతను తన కార్డియోకి కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. వీడియోలో సల్మాన్ ఖాన్ తన మేనల్లుళ్ళు, మేనకోడళ్లతో హోటల్ లాబీలో వారిని ట్రాలీపై నిలబెట్టి తిరుగుతూ కనిపించాడు. పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల ఆటమో కానీ సల్మాన్ ఖాన్ కు చెమట పట్టించారు. స్టార్స్ నుంచి ఫ్యాన్స్ వరకు ఈ వీడియోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ చూసి చాలా మంది బాలీవుడ్ స్టార్స్ స్ఫూర్తి పొందారు. అతను ఫిట్‌గా ఉండటానికి చాలా మంది తారలను ప్రేరేపించాడు. ఇందులో సోనాక్షి సిన్హా నుంచి అర్జున్ కపూర్ వరకు పేర్లు ఉన్నాయి. ఫిట్నెస్ కారణంగా, సల్మాన్ ఇప్పటికీ తన వయస్సును అధిగమించేలా కనిపిస్తాడు. ఏళ్లు పెరుగుతున్నా కొద్ది అతను యవ్వనంగా మారుతున్నాడని అతని అభిమానులు తరచుగా చెబుతూ ఉంటారు.